బోరు పంపును ప్రారంభించిన ఎంపీపీ

– బోరు పంపు ప్రారంభం
నవతెలంగాణ-వీణవంక
మండలంలోని మల్లారెడ్డిపల్లిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు యాదవ సంఘం వద్ద వేసిన బోరు పంపును ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి స్థానిక సర్పంచ్ మేకల ఎల్లారెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యాదవ కులస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్య్రకమంలో ఉప సర్పంచ్ భిక్షపతి, యాదవ సంఘం అధ్యక్షుడు దేవరాజు, ఉపాధ్యక్షుడు కర్రె నాని, కర్రె లచ్చయ్య, జంగ మణిదీప్, కర్రె లింగయ్య, గోపాల సాయిలు, పల్లెర్ల కిరణ్, రాజయ్య, శంకర్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love