అందుబాటులో జీలుగ విత్తనాలు

నవతెలంగాణ-వీణవంక
జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి గణేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని వీణవంక, చల్లూరు, బేతిగల్ ఆగ్రోస్ కేంద్రాల్లో సబ్సిడీలో ఈ విత్తనాలను ప్రభుత్వం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విత్తనాలు కిలోకు రూ.28.09 ఉంటాయని, కావాల్సిన రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ లను తీసుకొచ్చి విత్తనాలు తీసుకెళ్లవచ్చని తెలిపారు. కావున రైతులు ఈ అవకాశానిన సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Spread the love