కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే గాదరి కిశోర్

నవతెలంగాణ-సూర్యాపేట : ఆపత్కాలంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అండగా నిలిచాడు ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య గారి కుమారుడు గ్రామ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పాలబిందెల కృష్ణ ఆనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం స్థానిక నాయకులు తుంగతుర్తి ఎమ్మెల్యే శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ గారికి తెలియజేయడంతో అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద LOC ద్వారా ₹2,00,000/- రూపాయలు మంజూరు చేయించారు. ఈరోజు LOC పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు కోలా రమేష్ గౌడ్ అందజేశారు. ఆపద సమయంలో కాంగ్రెస్ పార్టీ అని చూడకుండా మా కుటుంబాన్ని ఆదుకున్నందుకు ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ గారికి రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

Spread the love