క్రీడలతో మానసికోల్లాసం

– రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
క్రీడలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని, ఆత్మ విశ్వాసాన్ని పెంచి, జీవితంలో విజయం సాధించడానికి తోడ్పడుతాయని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నేటి విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం అవుతున్నారని అన్నారు. సోమవారం స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల ఓరియోంటేషన్‌ హ్యాండ్‌బాల్‌, భారతీయం శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, భువనగిరి లో జాతీయస్థాయి క్రీడలు నిర్వహించామన్నారు.సీఎం కేసీఆర్‌ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో గుంటకండ్ల సావిత్రమ్మ ఫౌండేషన్‌ ద్వారా క్రీడాపరికరాలు అందజేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్యయాదవ్‌, డీసీఎంఎస్‌ చైర్మెన్‌ వట్టె జానయ్యయాదవ్‌, జెడ్పీ వైస్‌చైర్మెన్‌ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మెన నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మెన్‌ పుట్టకిశోర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్‌, ఉప్పలఆనంద్‌, గండూరి కృపాకర్‌, కౌన్సిలర్‌ రాపర్తి శ్రీనివాస్‌, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Spread the love