డార్విన్ జీవ పరిణామా సిద్ధాంతమే సమాజానికి మూలం..

-విజ్ఞాన దర్శిని అధ్యక్షులు…రమేష్…
నవ తెలంగాణ భువనగిరి రూరల్ 
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాఠ్యాంశం నుండి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడం సమాజ మార్పు మీద ప్రత్యక్ష దాడి చేస్తున్నట్టే అని డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతమే సమాజానికి మూలమని విజ్ఞాన దర్శిని అధ్యక్షులు రమేష్ అన్నారు. శుక్రవారం పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా పి ఎస్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో పాఠ్యాంశం నుండి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం తొలగింపు పై చర్చాగోష్టి కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సైన్సును పూర్తిగా విస్మరించి భావవాదాన్ని ముందుకు తీసుకొస్తూ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం తప్పు అని పాఠ్యాంశం నుండి తొలగించడం సమాజ మార్పు పై ప్రత్యక్షంగా దాడి చేస్తున్నట్టే అని వారు అన్నారు. అనేక దశాబ్దాలుగా అనేక రకాల అధ్యయనాలు చేసి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తీసుకువస్తే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం పాఠ్యాంశం నుండి తొలగించాలని కుట్ర సైన్సును పూర్తిగా నీరుగార్చడమే అని వారు అన్నారు. కనీసం బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సైన్స్ రంగానికి నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమై సైన్స్ తప్పు అని భావవాదాన్ని ప్రేరేపిస్తూ సైన్స్ పట్ల అవగాహన తగ్గించే ప్రయత్నం కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తుందని వారు అన్నారు ఈ నేపథ్యంలో డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం సమాజ మార్పుకు మూలంగా ఉందని దీనిని మరింత ప్రచారం చేయవలసిన అవసరం నేటి మేధావుల మీద ఉందని వారు అన్నారు. వీరితోపాటు PS అధ్యయన వేదిక కన్వీనర్ కల్లూరి మల్లేశం, ప్రజా సంఘాల నాయకులు ఎండి జహంగీర్, కొండమడుగు నర్సింహ, దండెమూడీ శ్రీచరణ్, పల్లెర్ల రమేష్, పి చెన్నయ్య, ముక్కెర్ల యాదయ్య, కాడారి వెంకటేష్, భాస్కర్ రెడ్డి, మాయ కృష్ణ, మామిడి వెంకట్ రెడ్డి, గడ్డం వెంకటేష్, సందేల రాజేష్, లావుడ్య రాజు, వడ్డేబోయిన వెంకటేష్ లు పాల్గొన్నారు.
Spread the love