జాతీయ ఉపకార వేతనాలు లో అశ్వారావుపేటకు ఒకటో ర్యాంక్…

– ఉపకార వేతనాలు ఎంపికలో ను మొదటి స్ధానం…
– విద్యార్ధులను అభినందించిన ఎంపీపీ,ప్రధానోపాధ్యాయులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇటీవల విడుదలైన ఎన్.ఎం.ఎం.ఎస్ – 2023 ఫలితాలలో జిల్లా స్థాయిలో  జెడ్.పి.ఎస్.ఎస్ అశ్వారావుపేట కు చెందిన కీర్తి శ్రీ ఒకటో ర్యాంక్ సాధించగా వేతనాలకు ఎంపికైన జాబితాలో ఈ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులతో రెండో స్థానం సాధించింది. 8 వ, తరగతి చదివే విద్యార్ధినులు 2022 డిసెంబర్ ఈ ఉపకారవేతనాలు ఎంపికకు అర్హత పరీక్షలు నిర్వహించారు. మార్చి నెలలో విడుదల చేసిన మెరిట్ లిస్ట్ లో జిల్లా స్థాయి లో మొదటి 10 ర్యాంకుల్లో పాఠశాలకు చెందిన  కీర్తి శ్రీ 1, రమేష్ 4 వ,జాహ్నవి 7 వ, శ్రీవల్లి 8 వ, అమూల్య 9 వ ర్యాంకులను సాధించారు. జిల్లా వ్యాప్తంగా 79 మంది ఈ ఉపకార వేతనాలకు ఎంపికైన వారిలోనూ జెడ్.పి.ఎస్.ఎస్ అశ్వారావుపేట 14 మందితో మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎంపీపీ శ్రీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి ఎంపికైన విద్యార్థులను, పాఠశాల సిబ్బంది ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్ నరసింహారావు మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున నాలుగు సంవత్సరాలపాటు ఉపకారవేతనాలు పొందుతారని తెలియజేశారు.ఈ ఫలితాలు జిల్లాలో  మన పాఠశాలకు ఉన్న గుర్తింపును  మరింత పెంచాయి అని,ఇంతటి ఘన విజయానికి కారకులైన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎం.సి చైర్మన్ ప్రసాద్,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
Spread the love