సీఎం కప్ టోర్నమెంట్ విజేతలకు అభినందనలు

– మెమెంటో లు అందజేసిన ఎంపీపీ శ్రీరామమూర్తి…
నవతెలంగాణ – అశ్వారావుపేట
సీఎం కప్ విజేతలను ఎం.పీ.పీ.పీ శ్రీరామమూర్తి అభినందించారు.అనంతరం వారికి జ్ఞాపికలను అందజేసారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో స్థానిక వ్యవసాయ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 15 నుండి నిర్వహించిన సీఎం కెసీఆర్ కప్ టోర్నమెంట్ క్రీడల్లో విజేతలకు బుధవారం అదే మైదానంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వారికి సర్టిఫికెట్స్ ను అందజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేరున సీఎం కప్ టోర్నమెంట్ ఆటల పోటీల ను ఈ నెల 15 నుండి 17 వరకు మండల స్థాయిలో పోటీలను నిర్వహించడం జరిగిందని,మండల స్థాయిలో అథ్లెటిక్స్, కబడ్డీ,కోకో,వాలీబాల్ , ఫుడ్ బాల్, లాంగ్ జంప్ ఆటల పోటీల లో గెలిచిన జట్ల అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తూ సర్టిఫికేట్ అందజేస్తున్నాం అని అన్నారు. మండల స్థాయిలో గెలిచిన విధంగానే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆడి గెలిచి సీఎం కప్ ను అశ్వారావుపేట కి తీసుకువచ్చి రాష్ట్రంలోనే అశ్వారావుపేట కు మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్, జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి,కోయ రంగాపురం సర్పంచ్ గోవింద్,ఎం.పి.డి.ఓ శ్రీనివాస రావు,ఎం.పి.ఇ.ఓ సీతా రామరాజు,ఎం.ఇ.ఒ కృష్ణయ్య,ఆర్ అండ్ బి శ్రీనివాస రావు,తదితరులు పాల్గొన్నారు.

Spread the love