మంజీర నది పై రోడ్డు ప్రమాదం… యువకులకు గాయాలు

నవతెలంగాణ-నసురుల్లాబాద్ 

 బీర్కూర్ మండల కేంద్రంలోని మంజీర నది బ్రిడ్జి వద్ద రెండు బైకులు ఢీ కొనడంతో గాయాల పాలైన యువకులు. శనివారం అర్థరాత్రి బిచ్కుంద మండలం మిషన్ కల్లాలి నుండి నిజామాబాద్ వైపు పెళ్లి ఓ శుభ కార్యమం కువెళ్లే వెళుతున్న సుమంత్ (32) జీవన్ (24) అనే యువకులు పల్సర్ వాహనంలో వెళ్తున్న సమయంలో మంజీరా బ్రిడ్జ్ వద్ద ఎదురుగా వస్తున్న గ్లామర్ బైకును ఢీకొని తీవ్ర గాయాల పాలైనారు. ఈ గ్లామర్ వాహనంలో షేక్ అహ్మద్(35)అనే వ్యక్తి నిజామాబాద్ నుండి తన అత్తగారింటికి వెళుతున్న సమయంలో గాయాలైనాయని ఇరువురు బాధితులు తెలిపారు. వీరికి 108 అంబులెన్స్ వాహనం ద్వారా చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Spread the love