నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ( టి యు )అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యందు టిబి సూపర్వైజర్ పోస్టు (ఎస్ టి ఎస్ )ఖాళీగా ఉందని దీంతో టీ బి వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు శుక్రవారం తెలిపారు.. కాంట్రాక్టు బేసిక్ లో పనిచేసే వ్యక్తి గత సంవత్సరం ఐదు నెలల నుండి విధులకు రావడం లేదని,, కిందిస్థాయి ఉద్యోగులకు ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని జిల్లా వైద్యాధికారి సుదర్శనం, ( డిటిసిఓ) లు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.