రాబోయే 4 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

Rainనవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి నుంచి హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి జనాలు చాలా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. కాగా నిన్న హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని చందా నగర్, మూసాపేట్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, రామచంద్రపురం, బాలానగర్ లాంటి పలు ప్రాంతాల్లో ఐదు నుంచి పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Spread the love