యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలి ఐక్య విద్యార్థి సంఘాలు

నవతెలంగాణ – కంటేశ్వర
తెలంగాణ యూనివర్సిటీ ని అవినీతి నుండి ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయాలని ఎన్ ఎస్ యు ఐ, పిడిఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, టీజీవీపి, పి డి ఎస్ సి పి వై ఎల్, ఎల్ ఎస్ ఓ, ఏఐపీఎస్యు, టిఎన్ఎస్ఎఫ్ (NSUI-PDSU-AISF-SFI-TGVP- PDSU-PYL-LSO-AIPSU-TNSF) విద్యార్థి సంఘాల నాయకులు వేణురాజ్ ,జన్నారపు రాజేశ్వర్ , రఘురాం, అనిల్ , గణేష్, కళ్యాణ్ , సాయి కృష్ణ, సాయిరెడ్డి, కిరణ్ , యూసుఫ్ అన్నారు. ఈ ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ లో రిజిస్ట్రార్ పదవి కొట్లాటతో యూనివర్సిటీ పరువు తీస్తున్నారని , విద్యార్థి సమస్యలను గాలికి వదిలేశారని , విద్యార్థులు ఫీజుల రూపంలో కట్టిన కోట్ల రూపాయలను వీసీ విచ్చల విడిగా ఖర్చు చేసారని , వీసీ అవినీతి , అక్రమ నియామకాలు , ప్రమోషన్స్ , యూనివర్సిటీ బయట వ్యక్తులకు యూనివర్సిటీ డబ్బులు చెల్లించటం జరిగిందని ,అయిన రాష్ట్ర ప్రభుత్వం వీసీ పై చర్యలు తీసుకోవటం లేదని , ఇంత జరుగుతున్న జిల్లా ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదని , పాలక మండలి తీర్మానాలను అమలు చేయటం లేదని, రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ వీసీ పై విచారణ చేపట్టాలని ,యూనివర్సిటీ లో బాలికలకు వసతి గృహం , ఆడిటోరియం , లైబ్రరీలో బుక్స్ సమస్యలు పరిష్కరించాలని కోరారు.యూనివర్సిటీ ప్రక్షాళన కోసం యూనివర్సిటీ పరిరక్షణ సమితి గా ఏర్పాటు చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మనోజ్,స్నేహిత,అశుర్,జ్వాల ఎన్ ఎస్ యు ఐ నాయకులు నిఖిల్ రెడ్డి, సయ్యద్ అష్రాఫ్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love