– సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ- కంటేశ్వర్
ప్రజా విప్లవ కళాకారుడు కామ్రేడ్ గద్దర్ నిన్న హాస్పిటల్లో అనారోగ్యంతో చనిపోవడంతో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. ప్రజా కళాకారుడుగా దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై నిత్యం తన గళం విప్పుతూ ప్రజలను చైతన్యం చేసి అనేకమంది విప్లవకారులను తయారు చేసిన కామ్రేడ్ గద్దర్ మరణించటం ప్రజాస్వామిక వాదులకు కళాకారులకు తీరని లోటని ఆయన ఏదైతే సమ సమాజాన్ని కోరుకున్నాడు ఆ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తనవంతుగా ప్రయత్నం చేస్తూ ప్రజా కళలను ప్రోత్సహించటమే గద్దర్కు నిజమైన నివాళి అని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లాలో సామాజిక సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన టీమాస్ ఉద్యమం సందర్భంగా రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద జరిపిన సభకు గద్దర్ హాజరై తన కళా ప్రదర్శనలను ఇచ్చే ప్రజలను చైతన్యం చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్ రాములు, నూర్జహాన్, ఏం గోవర్ధన్ జిల్లా కమిటీ సభ్యులు సుజాత, సూరి సుజానాటి మండలి జిల్లా కార్యదర్శి సిరిపలింగం మరియు మహేష్, డి. కృష్ణ అనిత ,కళావతి, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.