చట్టాలపై అవగాహన సదస్సు 

చట్టాలపై అవగాహన సదస్సు
చట్టాలపై అవగాహన సదస్సు
నవతెలంగాణ బోధన్ టౌన్ 
  రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి, లక్ష్మీనర్సయ్య ఆదేశాల బోధన్ పట్టణంలోని కోర్టు కార్యాలయంలో చట్టాలపై అవగాహన సదస్సు ను ఏర్పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిదిరాల రాణి, డాక్టర్ పల్నాటి సమ్మయ్య అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శనివారం చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిదిరాల రాణి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేర పరిశోధన కు సంంధించిన కీలకమైన ఆంశాల గురించి వివరించారు.
అవగాహన సదస్సులో పాల్గొన్న పోలీసులు
అవగాహన సదస్సులో పాల్గొన్న పోలీసులు

డాక్టర్ పల్నాటి సమ్మయ్య అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెషన్స్ కేసుల నందు సాక్ష్యాదారాల సేకరణ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో  పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, బోధన్ ఎసిపి కిరణ్ కుమార్, బోధన్ డివిజన్ సీఐలు జేయేష్ రెడ్డి, శ్రీనివాస్ రాజు, ఎస్సైలు పీటర్, నారాయణా సింగ్, సందీప్, నీరేష్, రామారావు, పోలీసు సిబ్బంది హాజరు అయ్యారు .

Spread the love