నవతెలంగాణ ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి చెందిన మాల్‌కు ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.3.14కోట్ల బకాయిలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఆర్టీసీ డీఎం ఆంజనేయులు ఈ నోటీసులు ఇచ్చారు. గురువారం సాయంత్రంలోపు బకాయిలు చెల్లించాలని.. లేకపోతే మాల్‌ను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణంలోని బస్టాండుకు ఆనుకొని ఆర్టీసీకి చెందిన 7 వేల చదరపు గజాల స్థలాన్ని 2013లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది. ఇందులో కొంతకాలం కిందట జీ-1(జీవన్‌రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్) పేరిట భవన నిర్మాణం చేపట్టి దుకాణాలు, సినిమా హాళ్లు ఏర్పాటు చేశారు. ఏడాది ప్రాతిపదికన ఆర్టీసీకి అద్దె చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు.