పొలాలను తలపిస్తున్న మంథని, పెద్దపల్లి ప్రధాన రహదారి 

– సింగరేణి జిఎం ఆదేశించిన లెక్కచేయని సివిల్ అధికారులు 
నవతెలంగాణ-రామగిరి
పెద్దపల్లి, మంథని ప్రధాన రహదారి పంట పొలాలను తలపిస్తున్నది. ఇందులో ముఖ్యంగా రామగిరి మండలంలోని ఆదివారంపేట, బేగంపేట, సెంటినరీ కాలనీ లోని ముజీబ్ టైర్ షాప్, లక్కీ బిర్యానీ సెంటర్, తెలంగాణ చౌరస్తా, జండా చౌరస్తా, రోడ్డు ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి పొలాలను తలపిస్తున్నది. ఈ విషయంపై సింగరేణి ఆర్జీ-3 జిఎం నరేంద్ర సుధాకర్ రావ్ జూలై మాసానికి గాను  ఏరియా ఉత్పత్తిపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రస్తావన రాగా, జిఎం కూడా రోజు వాకింగ్ చేయడానికి రాని రుద్రమదేవి గ్రౌండ్ కు వెళ్లే క్రమంలో ఆయన కూడా చూశారని తెలిపారు. పై విషయంపై వెంటనే సివిల్ (డీజీఎం) అధికారులకు గుంతలు పూడ్చాలని ఆదేశించి వారం రోజులు గడిచిన సింగరేణి సివిల్ అధికారులు దేవుడు వరమిచ్చినా పూజారి కనుకరించిన విధంగా నిమ్మకు నీరుతినట్లు వ్యవహరిస్తున్నారు. ఆదివారం ముజీబ్ టైర్ షాప్ ముందు గుంతలో పడి ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇప్పటికైనా ఈ రోడ్డు సింగరేణి సంస్థ అయినా ప్రభుత్వ రంగ సంస్థల ముందుకు వచ్చి మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Spread the love