ఊడిందనుకుంటే పప్పులో కాలేసినట్లే..

నవతెలంగాణ-వీణవంక
నేరాలను నిరోధించేందుకు, నేరాలను అరికట్టేందుకు ప్రజలు, దాతల సహకారంతో లక్షలు వెచ్చించి పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ అవి కొద్ది రోజులు మాత్రమే పనిచేశాయి. నిత్యం ప్రజల రద్దీ ఉండే ప్రాంతాల్లో అవి ప్రస్తుతం పని చేయడం లేదు. దీనికి ఉదహారణే వీణవంక బస్టాండ్ సెంటర్లో కనెక్షన్ ఊడిపోయిన సీసీ కెమెరా. దీని కనెక్షన్ గాలికి ఊడిపోయిందనుకుంటే పప్పులో కాలేసినట్లే.. కొందరు అక్రమార్కులు అక్రమ వ్యాపారాలు చేసుకునేందుకే పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల కనెక్షన్లను తీసేసినట్లు తెలుస్తుంది. నేరాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయకపోవడం వల్ల నేరాలు పెరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి సీసీ కెమెరాలకు మరమ్మతులు చేస్తే గానీ అక్రమాలు ఆగే అవకాశం లేదు.

Spread the love