బొడ్రాయి ఉత్సవాలకు విప్ కౌశిక్ రెడ్డి హాజరు

– రూ.లక్ష విరాళం అందజేత
నవతెలంగాణ – వీణవంక
మండలంలోని లస్మక్కపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి ఉత్సవాలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు సంబంధించి రూ.లక్ష విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామదేవతల ఆశీస్సులతో గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వీణవంకతో సమానంగా లస్మక్కపల్లి ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముసుపట్ల రేణుకా తిరుపతిరెడ్డి జెడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, సర్పంచ్ లు దాసారపు సుజాత-లక్ష్మణ్, నీల కుమారస్వామి, మ్యాకల సమ్మిరెడ్డి, ఉపసర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి తదితరులు హాజరయ్యారు.

Spread the love