మానవత్వం చాటిన చింతల.. 

నవతెలంగాణ- వీణవంక 
వీణవంక మండలంలోని నర్సింగాపూర్ మనకి చెందిన సుమారు 50 మంది దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాస్ ఇవ్వడం జరిగింది. తన సొంత ఖర్చులతో సుమారు 50 మందికి వికలాంగులకు శనివారం నర్సింగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బస్సు పాస్ లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే సంకల్పంతో తనకు తోచిన విధంగా దివ్యాంగులకు సేవ చేయాలని భావంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగిందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో తమ వంతు సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ డిపో మేనేజర్ పుప్పాల అర్పిత చేతుల మీదుగా అందివ్వడం జరిగిందని మీ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్న లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ బస్సును ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో విలేజ్ బస్సు పాస్ ఆఫీసర్ దేవేందర్ రెడ్డి, పత్తి కొండల్ రెడ్డి, కనకంటి శ్రీనివాస్ రెడ్డి, పత్తి శరో త్నం రెడ్డి, కండె ప్రభాకర్, వసంత కుమార్, జునుతుల రమ, వంగల కొండల్ రెడ్డి, సమ్మయ్య , తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love