నవతెలంగాణ -వీణవంక
భూ తగాదాలపై ఒకరిపై ఒకరు గొడ్డలితో దాడికి పాల్పడిన ఘటన మండలంలోని శ్రీరాములపేట గ్రామంలో గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని శ్రీరాములపేటకు చెందిన చుక్కల బుచ్చయ్య(62)కు అదే గ్రామానికి చెందిన చుక్కల శ్రీనివాస్ కు భూ తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పంచాయితీలు పలుమార్లు జరిగాయి. అయితే భూ వివాదం ముగియకపోగా బుచ్చయ్యపై శ్రీనివాస్ కక్ష పెంచుకుని గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బుచ్చయ్య తలకు, భుజంపై తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, బంధువులు బాధితుడిని చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ విషయంపై ఎస్సై శేఖర్ ను వివరణ కోరగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.