దశాబ్ది ఉత్సవాల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

నవతెలంగాణ – కరీంనగర్
కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా స్థాయి అధికారులు తమలో ఉన్న ప్రతిభతో ఇచ్చిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అడిషనల్ డీసీపీ (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్ ఆడ మగ గొంతుల కలయికతో ఆలపించిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న జానపద గేయంపై చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. బాల భవన్ విద్యార్థుల నృత్యాల ప్రదర్శన, ఆర్కెస్ట్రాలతో పలు ప్రదర్శనలు అల. కళాకారులను ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు అభినందించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం *బడాఖానా* ఏర్పాటయింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక సారథి మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్, నగర మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యాం ప్రసాద్ లాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వాట్సన్ టోప్పో, ప్రొబేషనరి ఐపిఎస్ అధికారి మహేష్ బాబా సాహెబ్, అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్, (శాంతిభద్రతలు) భీమ్ రావు (సిఏఆర్) ఏసిపిలు కరుణాకర్ రావు, తుల శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, కాశయ్య, ప్రతాప్, విజయసారథి లతో పాటుగా పలువురు పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు

Spread the love