అప్రకటిత “పోలీసు నిర్బంధానికి” రాష్ట్రప్రభుత్వ ఆమోదముద్ర ఉందా..!

నవతెలంగాణ – సిరిసిల్ల: జిల్లాలో పోలీసులు కొనసాగిస్తున్న ఆప్రకటిత నిర్బంధానికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం ఉందా అని జనశక్తి నేత కూర రాజన్న సూటిగా ప్రశ్నించారు. జనశక్తి నిషేధిత పార్టీ కాదని తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనశక్తి నేత కూర రాజన్న మాట్లాడారు. 12 ఆపరేషన్లు పైగా జరిగి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తనపై పోలీసులు అసత్య ఆరోపణలతో తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు.. చట్టపరంగా కేసులను ఎదుర్కొంటున్న క్రమంలో స్థానికంగా వేములవాడ కావడంతో ఇల్లు పూర్తిగా శిథిలమైన దిశలో స్నేహితుల సహకారంతో ఆశ్రయం పొందుతున్ననాని అన్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారిపై స్థానిక సీఐ అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.. జనశక్తి నిషేధిత పార్టీ కాదని తనతో మాట్లాడినంత మాత్రాన నేర మెలా అవుతుందని ప్రశ్నించారు.. ఇప్పటికే సిరిసిల్ల వేములవాడలో తనతో మాట్లాడిన కుంటయ్య తో పాటు పలువురుపై అక్రమంగా కేసులు పెట్టి జిల్లాలో అప్రకటిత నిర్బంధాన్ని అమలు చేస్తున్న పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదముద్ర ఉందా అని అన్నారు. మాట్లాడే సభలు పెట్టుకునే ప్రాథమిక హక్కులను కూడా హరించడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. ఒకవేళ పోలీసులకు అక్రమ నిర్బంధంపై రాష్ట్ర ప్రభుత్వ ఆమోద ముద్ర ఉంటే కేంద్రంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తూ వరవరరావు సాయిబాబా లాంటి వాళ్లను నిర్బంధించిన మోడీ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తేడా ఏముందని ప్రశ్నించారు..
సిరిసిల్ల వేములవాడలో సిఐలు గా పనిచేస్తున్న అధికారులు పోలీసులుగా విధుల్లో చేరినప్పుడు వారి ఆస్తి ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులకు భయపడబోమని చట్టపరంగానే తేల్చుకుంటామని చావుకు భయపడేది లేదని ప్రాణాలు పోతాయని తెలిసే ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నామని చివరిదాకా తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. సమావేశంలో న్యాయవాది రాజేశం,మార్వాడి సుదర్శన్, చేట్టి ఈశ్వర్, ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక నాయకులు సంతోష్ పాల్గొన్నారు..

Spread the love