ఒడిశా రైలు దుర్ఘటనపై యూకే పార్లమెంట్ సంతాపం

నవతెలంగాణ – యూకే: ఒడిశా రైలు ప్రమాదంపై పలు దేశాలు సంతాపం తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యూకే పార్లమెంట్‌ ఒడిశా రైలు ప్రమాదంపై సంతాపం తెలిపింది. గత వారంలో జరిగిన ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది మరణించడం.. 1000 మంది వరకు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర విషాద ఘటనపై యూకే పార్లమెంట్ సంతాపం వ్యక్తం చేసింది. గత వారం ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు భారతదేశానికి క్రాస్-పార్టీ సంతాపాన్ని తెలియజేయడానికి హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఒక తీర్మానం సమర్పించబడింది. లండన్‌లోని సౌతాల్‌కు చెందిన భారతీయ సంతతికి చెందిన ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ సోమవారం ప్రవేశపెట్టిన ఎర్లీ డే మోషన్ను ఉత్తర ఇంగ్లాండ్‌లోని స్టాక్‌పోర్ట్‌కు చెందిన లేబర్ ఎంపీ నవేందు మిశ్రా కూడా సమర్థించారు.

Spread the love