నవతెలంగాణ – చెన్నై: స్నేహితుడి మృతదేహంపై కూర్చుని ఓ అఘోరా పూజలు చేసిన ఘటన కోయంబత్తూరు జిల్లా సూలూర్ వద్ద ఆదివారం జరిగింది. సూలూర్ సమీపం కురుంబపాళెయానికి చెందిన మణికంఠన్.. అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి రెండేళ్ల క్రితం వివాహమైంది. అభిప్రాయభేదాలతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన మణికంఠన్ ఆదివారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తిరుచ్చికి చెందిన అతడి చిన్ననాటి స్నేహితుడు ఒకరికి తెలిసింది. ప్రస్తుతం అఘోరాగా ఉంటున్న ఆ వ్యక్తి సూలూర్‌కి వచ్చి మణికంఠన్ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. స్నేహితుడి మృతదేహంపై కూర్చుని పూజలు చేశాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.