నవతెలంగాణ – గుంటూరు
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో తెదేపా అధినేత చంద్రబాబు నివసిస్తున్న ఇంటి జప్తునకు (ఎటాచ్) అనుమతి ఉత్తర్వులు పొందేందుకు విజయవాడలోని అనిశా కోర్టులో ఏపీ సీఐడీ దరఖాస్తు దాఖలు చేసింది. మంగళవారం జరిగిన విచారణలో ప్రత్యేక పీపీ వైఎన్ వివేకానంద వాదనలు వినిపించారు. ఎటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చట్ట నిబంధనల పరిశీలన, తదుపరి వాదనలు వినేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీచేశారు.