ఫేజ్ 1 ఎన్నికల మేనిఫెస్టోను రేపు విడుదల చేస్తాం : చంద్రబాబు

నవతెలంగాణ – హైదరాబాద్
వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అప్పుడే సన్నద్ధమవుతోంది. ఎన్నికలకు సంబంధించి ఫేజ్ 1 మేనిఫెస్టోను రేపు విడుదల చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఎన్నికలు 2024లో వచ్చినా, అంతకు ముందే వచ్చినా సైకిల్ రెడీగా ఉందని అన్నారు. గత నాలుగేళ్లగా వైసీపీ ప్రభుత్వం ఎంతో వేధిస్తున్నా టీడీపీ కార్యకర్తలు భయపడలేదని, వెనుకంజ వేయలేదని ప్రశంసించారు.

Spread the love