నేడు మూడోవిడత పోలింగ్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : సార్వత్రిక సమరంలో మరో దశ పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. మూడో విడతలో భాగంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో మంగళవారం ఓటింగ్‌ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. 1,300 మందికిపైగా అభ్యర్థులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు. కేంద్రమంత్రులు అమిత్‌ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్‌ మాండవీయ, పురుషోత్తమ్‌ రూపాలా, ప్రహ్లాద్‌ జోషి, ఎస్‌.పి.సింగ్‌ బఘెల్‌ కూడా తృతీయ విడత బరిలో నిలిచారు. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, గోవా, దాద్రానగర్ హవేలి-దమన్ దీవ్ లొ పోలింగ్ జరగనుంది.

Spread the love