తిరోగమన దిశలో తెలంగాణ

– కరీంనగర్ బిజెపి పార్లమెంటు కన్వీనర్ ప్రవీణ్ రావు
నవతెలంగాణ-గంగాధర : అభివృద్ధి, సంక్షేమం మాటలకే పరిమితం కాగా తెలంగాణ రాష్ట్రం తిరోగమన దిశలో ఉందని కరీంనగర్ బీజేపీ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నియోజక వర్గ స్థాయి బీజేపీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ పాలనకు 9 ఏళ్ల పాలనలో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలు,అభివృద్ధి అంశాలు ప్రజలకు వివరించేందుకు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జేవాడేకేర్ జూన్ 12 వ తేదీన గంగాధరలో జరిగేసభకు హాజరు అవుతున్నారని అన్నారు. ఈ సభ విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. విద్యుత్ పంపిణీ సంస్థలకు 50 వేల కోట్లు అప్పు బాకీ పడిన సర్కార్ విద్యుత్ విజయెాజత్సవ సభలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుబంధు ఒక్కటే సీఎం కేసీఆర్ కు సర్వరోగ నివారినిగా మారిందని ఆయన విమర్శించారు. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం ద్వారా కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రవణ్ కుమార్, దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాల్ రెడ్డి, జిల్లా కోశాధికారి వైద రామానుజం, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీపతి చంద్రశేఖర్, ఓబీసీ జిల్లా మూర్ఛ అధ్యక్షులు,దుాలం కళ్యాణ్, మండల అధ్యకులు, అశోక్, గుడి రవీందర్ రెడ్డి, నేరెళ్ళ శ్రవణ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రేండ్ల శ్రీనివాస్, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Spread the love