కన్నయ్య కుమార్‌కు కాంగ్రెస్ కీలక బాధ్యతలు

kanhaiya-kumar
kanhaiya-kumar

నవతెలంగాణ – ఢిల్లీ
పార్టీ నేత, ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కు కాంగ్రెస్ పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది. పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) ఏఐసీసీ ఇంఛార్జిగా నియమించింది. కన్నయ్య కుమార్ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా నీరజ్ కుందన్ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడతుండటం, త్వరలో మధ్యప్రదేశ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పలువురిని కీలక పదవుల్లో నియమించింది. మధ్యప్రదేశ్ లో నలుగురు నేతలను పార్టీ ప్రధాన కార్యదర్శులుగా, మరో నలుగురిని డీసీసీ అధ్యక్షులుగా నియమించింది. గత ఏడాది పంజాబ్ ఎన్నిల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని చక్కదిద్దేందుకు 31 మంది నేతలతో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అంబికా సోని, సుఖీందర్ సింగ్, తాజీందర్ సింగ్ బిట్టు, చరణ్ జిత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మనీశ్ తివారీ సహా పలువురు నేతలు ఉన్నారు.

Spread the love