ఈనెల 8నుండి గ్రూప్-2 ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌..

నవతెలంగాణ-హైద‌రాబాద్ : తెలంగాణ‌లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భ‌ర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే గ్రూప్-2 అభ్య‌ర్థుల ద‌ర‌ఖాస్తులో వివ‌రాల స‌వ‌ర‌ణ‌కు టీఎస్‌పీఎస్సీ అవ‌కాశం క‌ల్పించింది. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ మ‌ధ్య‌లో అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు. గ్రూప్‌-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్ర‌వ‌రి 16 సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలను ఆగ‌స్టు 29, 30 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. కాగా, ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ ప‌డుతున్నారు.

Spread the love