ప్రభుత్వ కార్యాలయంలో బంగారు బిస్కెట్లు సీజ్‌

నవతెలంగాణ – జైపూర్‌:  శుక్రవారం రాత్రి ప్రభుత్వ కార్యాలయం ఆఫీస్‌పై పోలీసులు దాడిచేశారు. కార్యాలయంలోని ఓ గదిలో ఉన్న కబ్‌బోర్డులో బ్యాగును గుర్తించారు. తెరచిచూస్తే అధికారులే విస్తుపోయారు. బ్యాగు నిండా నోట్లకట్టలు. అందులో బంగారు బిస్కెట్లు కూడా ఉన్నాయి. దీంతో దానిని సీజ్‌చేసిన ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. జైపూర్‌లోని ఐటీ శాఖకు చెందిన యోజనా భవన్‌లో లెక్కల్లోకిరాని డబ్బును అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఓ బ్యాగ్‌లో రూ.2.31 కోట్ల నగదు, కిలో బరువున్న బంగారు బిస్కెట్లను గుర్తించారు. ఆ మొత్తాన్ని సీజ్‌చేసి ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అందజేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఆ డబ్బు, బంగారం ఆఫీసులోకి ఎలా వచ్చింది, అది ఎవరిదనేది గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృంధాన్ని ఏర్పాటుచేశామని జైపూర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆనంద్‌ శ్రీవాత్సవ చెప్పారు.

Spread the love