శ్యామ్ మృతిపై ఎన్టీఆర్ స్పందన..

నవతెలంగాణ – హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన మృతి చెందారు. తన కొడుకుది హత్య అని శ్యామ్ తండ్రి చెపుతుండగా శ్యామ్ ఉరి వేసుకుని చనిపోయాడని పోలీసులు చెపుతున్నారు. ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై ఎన్టీఆర్ స్పందించాడు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని అన్నారు. శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. శ్యామ్ ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు.

Spread the love