మళ్లీ వివాదాస్పదంగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సీటు వ్యవహారం

నవతెలంగాణ – నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సీటు వ్యవహారం మళ్ళీ వివాదాస్పదంగా మారింది. తెలంగాణ యూనివర్సిటీలో మళ్ళీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరి బాధ్యతలు చేపట్టారు. మూడు రోజుల క్రితం ప్రొఫెసర్ కనకయ్యను వైస్ ఛాన్సులర్ రవీందర్ గుప్తా రిజిస్ట్రార్‌గా నియమించారు. యూనివర్సిటీ పరువును బజారుకీడుస్తున్నారని విద్యార్థులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రార్ ఛాంబర్‌లో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఎవరు రిజిస్ట్రారో తేల్చాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. ఇద్దరు రిజిస్ట్రార్లతో విద్యార్థులు, సిబ్బంది వివాదానికి దిగారు.

Spread the love