ఉపాధి హామీచట్టానికి తూట్లు ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలి

Framework for Employment Guarantee Act
He should defeat in the election and speak his mind– ప్రజానేత సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించండి : కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
– ప్రమాదంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం: మల్లు లకిë
నవతెలంగాణ-కట్టంగూర్‌/ అర్వపల్లి
వామపక్ష పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించి నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య అన్నారు. ఉపాధి హామీ చట్టం రక్షణకు ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రజానేతగా, నిత్యం ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్‌ను గెలిపించాలని కోరుతూ మంగళవారం నల్లగొండ జిల్లాలో పలుచోట్ల నాగయ్యతోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లకిë ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కట్టంగూరు మండలం పిట్టంపల్లి గ్రామంలో నాగయ్య ఉపాధి కూలీలను కలిసి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు యూపీఏ ప్రభుత్వంతో కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని తెచ్చింది సీపీఐ(ఎం) అని గుర్తు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మంచి అభ్యర్థికి ఓటు వేయాలని, ప్రజలను ముంచే అభ్యర్థులను ఓడించాలని కోరారు. పూటకో పార్టీ మార్చే అవకాశవాదులకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం కమ్యూనిస్టుల పోరాట ఫలాలని వివరించారు. అవి కమ్యూనిస్టుల త్యాగాల ఫలితంగా వచ్చాయన్నారు. 2000లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో ముగ్గురు కార్యకర్తల ప్రాణత్యాగం, సీపీఐ(ఎం) సుదీర్ఘ ఉద్యమ ఫలితమే నేటి ఉచిత కరెంట్‌ సరఫరా అని చెప్పారు. బీజేపీ విధానాలు కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా.. పేదలకు పెనుభారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోటీశ్వరులకు పన్ను రాయితీలిస్తూ పేద ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. వీటన్నింటిపై చట్టసభల్లో కొట్లాడేందుకు నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ, నాయకులు గంజి మురళీధర్‌, దండెంపల్లి సత్తయ్య, పెంజర్ల సైదులు, జాల రమేశ్‌, ముస్కు మారయ్య, ఎన్న నర్సిరెడ్డి, కారింగ్‌ రమణ పాల్గొన్నారు.
భీంరెడ్డి, మల్లు స్వరాజ్యం పోరాట ఫలితమే శ్రీరాంసాగర్‌ నీళ్లు
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మీ
భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం పోరాట ఫలితంగానే శ్రీరాంసాగర్‌ నీళ్లు వచ్చాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లకిë అన్నారు. వారి వారసుడిగా నిత్యం ప్రజాసమస్యలపై పోరాడుతున్న సీపీఐ(ఎం) భువనగిరి ఎంపీ అభ్యర్థి జహంగీర్‌ని గెలిపించాలని కోరారు. అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెంలో జహంగీర్‌ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ, అవినీతికర కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ సుత్తికొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో లౌకికవాద, ప్రజాస్వామ్య, భారత రిపబ్లిక్‌ ఉనికే ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం దేశంలో కార్మికుల హక్కులను నాశనం చేసేందుకు, ప్రజలను మతపరంగా విభజించేందుకు యత్నిస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని, దాని మిత్రపక్షాలను ఓడించడమే ప్రతి దేశభక్తుని కర్తవ్యంగా భావించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చెరుకు ఏకలక్ష్మీ, నాయకులు జె.నర్సింహారావు, వీరబోయిన రవి, వజ్జె శ్రీనివాస్‌, వజ్జె సైదులు, సిగ వెంకన్న, శ్రీను, రవి, శ్రీకాంత్‌, విజరుకుమార్‌, నిమ్మలగుంటి అబ్బులు, బుచ్చిరాములు, సీనియర్‌ నాయకులు అరిగె వీరస్వామి, నర్సయ్య పాల్గొన్నారు.

Spread the love