నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉస్మానియా, జేఎన్‌టీయూ హైదరాబాద్, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలకు వీసీల నియామకానికి విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 12న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.