పల్లె పకృతి వనంలో బోరు మోటార్ దొంగతనం..

నవతెలంగాణ -డిచ్ పల్లి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె పకృతి వనం లో ఉన్న బోర్ మోటార్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకు పోయారని తిర్మన్ పల్లి ఎంపిటిసి చింతల దాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ దర్ లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని కెజిబివి పాఠశాల వద్ద పల్లె పకృతి వనం ను ఏర్పాటు చేశామని, పకృతి వనం కు కాకుండా పక్కనే కొద్ది దూరంలో ఉన్న కెజిబివి లో బోర్ లేకపోవడం తో పకృతి వనం లో ఉన్న బోర్ మోటార్ నుండే అనునిత్యం నీటిని అందజేస్తామని చెప్పారు.మంగళవారం సాయంత్రం వరకు ఉన్న బోర్ మోటార్ బుధవారం ఉదయం పకృతి వనం కు వేళ్ళి చూడగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుని పోయినట్లు వారన్నారు.పల్లె పకృతి వనం నుండి కెజిబివి వరకు పైప్ లైన్ కు ఎంపిటిసి చింతల దాస్ నీదులను అందజేసినట్లు వివరించారు.ఇదే విషయమై ఎస్ ఐ మహేష్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.బోర్ మోటార్ ను ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.
Spread the love