నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
ఇంటింటి సర్వేలో ఓటర్ల నమోదు పక్కాగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. పెద్ద కొడపగల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బి ఎల్ ఓ లతో ఏర్పాటు చేసిన సమావేశానికి అదనపు కలెక్టర్ ఇచ్చేశారు ఓటర్ల జాబితా పై పోలింగ్ స్టేషన్ల వారీగా అదనపు కలెక్టర్ తో కలిసి బి ఎల్ వో ల తో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో ఓటర్ల నమోదు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.ఇంటి నెంబర్ లేని ఇండ్లల్లో ఉన్న ఓటర్లు నమోదు కొరకు పక్క ఇంటి నెంబర్తో నమోదు చేయాలన్నారు మృతుల ఓటర్ల తొలగింపులో మరణ ధ్రువీకరణ పత్రము ప్రాతిపదిక కాదని తెలియజేశారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 ఓట్ల నుండి1000ఓట్ల వరకు నమోదై ఉంటారని వారిలో కనీసం30మంది అయిన18సంవత్సరముల వారు ఓటరుగా నమోదై కనిపించాలన్నారు.ప్రతి పోలింగ్ సెంటర్ పరిధిలోని250కుటుంబాలకు సుమారు800 ఓట్ల పైగా ఉంటాయని ప్రతి ఓటు వివరాలు బిఎల్ఓ దగ్గర తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈనెల21నుండి సెప్టెంబర్19వ తేదీ వరకు నెలరోజుల కాలపరిమితి ఉన్నందున ఇంటింటి ఓటర్ నమోదు సర్వేపక్కాగా చేపట్టలన్నారు.ఆరోగ్యకరమైన ఓటరు జాబితాను రూపొందించాలని, బిఎల్ఓ లకు ఓటరు జాబితా రూపకల్పన,తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా స్పష్టమైన ఓటరు జాబితా తయారు చేయాలన్నారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. జెండర్ రేషియోను ప్రత్యేక శ్రద్ధతో వెరిఫై చేయాలన్నారు.18నుండి19సంవత్సరాల వయస్సు గల ఓటర్లు ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో నాలుగు శాతం ఉండాలని తెలిపారు.
ఓటరు, నమోదు మార్పుల, చేర్పులకు ప్రత్యేక శిబిరాలు:
సెప్టెంబర్ 2, 3 తేదీలలో ఓటరు నమోదు, మార్పులు చేర్పులకై ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లుఅదనపు కలెక్టర్ తెలిపారు. ఆయా తేదిలలో బీఎల్ఓ లు వారి వారి పోలింగ్ కేంద్రాలలో ఓటరు జాబితా తో ఉదయం 10 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఫారం 6, 7,8 లతో అందుబాటులో ఉండి, స్వీకరించాలని ఆదేశించారు. ప్రత్యేక శిబిరాల గురించి గ్రామంలో ముందు రోజు ప్రచారం చేయించాలని సూచించారు. ఓటరు జాబితా నుండి చనిపోయిన వారిని తొలగించాలనుకుంటే ఫారమ్ -7 ద్వారా ఫిర్యాదు పొందిన తర్వాత విచారణ చేసి తొలగించాలన్నారు. 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, వికలాంగులు తమ ఇంటి వద్ద నుండి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ సదుపాయం కల్పించిందని, వారి వివరాలను సేకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దశరథ్,నిజాంసాగర్ డిప్యూటీ తాసిల్దార్ నవీన్, బిఎల్వోలు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.