చైనాలో భారీ భూకంపం…

Earthquke-chainaనవతెలంగాణ – బీజింగ్: చైనా తూర్పు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 5.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సంస్థ వెల్లడించింది. ప్రమాదంలో డజన్ల కొద్దీ భావనాలు నేలమట్టం కాగా 21 మంది మరణించినట్టు  మీడియా వర్గాలు తెలిపాయి. దక్షిణ షెజోలోని శాండోంగ్ ప్రావిన్స్ లో ఆదివారం తెల్లవారుజాము 2.33 గంటలకు సంభవించిన ఈ భూకంపం ఉపరితలానికి 10కి.మీ. లోతున పుట్టిందని, సుమారు 26 కిలోమీటర్ల మేర ఇది ప్రభావం చూపిందని తెలిపింది యూఎస్ జియోలాజికల్ సంస్థ. భూకంపం తీవ్రతకు కనీసం 126 భవనాలు కుప్పకూలిపోయినట్లు తెలిపాయి శాండోంగ్ అధికారిక బృందాలు.

Spread the love