పసిఫిక్‌ మహాసముద్రంలో భారీ భూకంపం

నవతెలంగాణ – కాన్‌బెర్రా: పసిఫిక్‌ మహాసముద్రం ఆగ్నేయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. లార్డ్‌ హోవ్‌ ఐలాండ్‌కు సునామీ ప్రమాదం పొంచి ఉందని ఆస్ట్రేలియాకు చెందిన బ్యూరో ఆఫ్‌ మెటీరియాలజీ (బీఓఎమ్‌) శుక్రవారం హెచ్చరించింది. వనౌత్‌, న్యూ కలెడోనియాకు ముప్పు ఉంది. హోవ్‌ ఐలాండ్‌ ప్రాంతంలో తీవ్రంగా గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. వనౌత్‌లో సునామీ సృష్టించింది. లాయల్టీలో 37 కి.మీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్‌ జియలాజికల్‌ సర్వే తెలిపింది.

Spread the love