నేడు కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం…

నవతెలంగాణ – కర్ణాటక
కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగనున్నది. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌, మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ పలువురు విపక్ష నేతలను ఆహ్వానించింది. అయితే మిత్రపక్షాలు, తమకు అనుకూలంగా ఉండే పలు రాష్ర్టాల సీఎంలు, పార్టీల నేతలకు మాత్రమే ఆహ్వానాలు పంపింది. తెలంగాణ, కేరళ, ఒడిశా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల బీజేపీయేతర సీఎంలకు మాత్రం ఆహ్వానాలు పంపకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయా రాష్ర్టాల్లోని అధికార పార్టీల నుంచి తమ పార్టీ ఉనికికి ముప్పు లేదా పోటీ ఉన్నదనే ఆలోచనలతో వారిని ఆహ్వానించలేదని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలన్నింటినీ ఏకం చేస్తామని చెప్పుకొస్తున్న కాంగ్రెస్‌.. ఈ విధమైన పక్షపాతంతో ఎలా ముందుకెళ్తుందన్న ప్రశ్నలు వస్తున్నాయి.

Spread the love