జమ్ముకశ్మీర్‌లో వరుసగా భూకంపాలు…

నవతెలంగాణ – కత్రా: జమ్ముకశ్మీర్‌లో మరోసారి భూకంపం వచ్చింది. మంగళవారం దోడా కేంద్రంగా భారీ భూకంపం రాగా, బుధవారం తెల్లవారుజామున కత్రా కేంద్రంగా భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు కత్రాలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం కత్రాకు 81 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు సంభవించాయని పేర్కొంది. కశ్మీర్‌లోని దోడా కేంద్రంగా మంగళవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌‌, హర్యానా, పంజాబ్‌, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్లపాటు తీవ్రస్థాయిలో కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.4గా నమోదైంది. భూకంప తాకిడికి జమ్ముకశ్మీర్‌లో పలు ఇండ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. దోడాలోని ఓ సబ్‌ డిస్ట్రిక్‌ హాస్పిటల్‌లో రోగులకు గాయాలయ్యాయి.

Spread the love