– హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస
నవతెలంగాణ- హుస్నాబాద్ : హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సార్ గుర్తుకు ఓటు వేసి మరోసారి గెలిపించాలని ఎంపీపీ లకావత్ మానస సుభాష్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామంలో సర్పంచ్ తోడేటి రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. పందిళ్ళ గ్రామ అభివృద్ధి కరపత్రాలతో పాటు బీఆర్‌ఎస్ మేనిఫెస్టో పత్రాలను ప్రజలకు అందించారు. తెలంగాణ ఏర్పడ్డాక గ్రామాల అభివృద్ధిపై ప్రజల వివరిస్తూ , సతీష్ కుమార్ గెలిస్తే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో హ్యాట్రిక్ విజయం ఇవ్వాలన్నారు