ఉత్తర భారతంలోనూ కంపించిన భూమి..

నవతెలంగాణ -న్యూఢిల్లీ: హిమాలయ దేశం నేపాల్‌లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీనిప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ ప్రకంపణలు వచ్చాయి. 15 సెకన్లపాటు భూమి కంపించింది. శుక్రవారం రాత్రి 11.32 గంటలకు ఢిల్లీ, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. రాత్రి టీవీ చూస్తుండగా ఒక్కసారిగా భూకంపం వచ్చిందని నోయిడాకు చెందిన తుషార్‌ చెప్పారు. తర్వాత భూకంపం వచ్చిందని టీవీ చెప్పారని, దీంతో తాను ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశానని వెల్లడించారు. మంచంపై పడుకొని ఉండగా అది కదలడం ప్రారంభిందని, సీలింగ్‌ ఫ్యాన్‌ కూడా కదలడం గణించానని బీహార్‌ రాజధాని పాట్నాకు చెందిన ఓ నివాసితుడు చెప్పారు. వెంటనే తాను ఇంట్లోనుంచి బయటకు వచ్చానని చెప్పారు. అసలు ఏం జరుగుతుంతో గుర్తించడానికి కొంత సమయం పట్టిందని ఢిల్లీకి చెందిన ఓ మహిళ అన్నారు.

Spread the love