అఫ్గానిస్థాన్‌లో మరోసారి కంపించిన భూమి..

నవతెలంగాణ – కాబూల్‌: అఫ్గానిస్థాన్ మరోసారి భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు అఫ్గాన్‌లో భూకంపం  వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 150 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. కాగా, అఫ్గానిస్థాన్‌లో గత రెండు వారాల్లో భూకంపం రావడం ఇది నాలుగోసారి. ఇటీవల హెరాత్ (Herat) ప్రావిన్సులో సంభవించిన భూకంపం వల్ల 4వేల మందికిపైగా చనిపోయారు. అక్టోబర్ 15న 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ నెల 13న 4.6 తీవ్రతతో, 11వ తేదీన 6.1 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. ఇక గతవారం వచ్చిన భారీభూకంపం వల్ల 4 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. భూకంపం ధాటికి 20 గ్రామాల్లో 1983 ఇండ్లు నేలమట్టమయ్యాయని అఫ్గానిస్థాన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ శాఖ ప్రకటించింది.

Spread the love