డిసెంబర్‌ 19న ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ సమావేశం

నవతెలంగాణ – న్యూఢిల్లీ :   ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశం డిసెంబర్‌ 19న ఢిల్లీలో నిర్వహించే  అవకాశం ఉందని సంబంధిత వర్గాలు ఆదివారం తెలిపాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్లపంపకం అజెండాలో ప్రధాన అంశంగా ఉండనున్నట్లు పేర్కొన్నాయి. సమాజ్‌ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌తో విభేదాలను కూడా కాంగ్రెస్‌ పరిష్కరించుకుందని, ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరగనున్న తొలి సమావేశానికి ఆయన కూడా హాజరుకానున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

Spread the love