భారత్‌కు అధునాతన ఎంక్యూ-9బీ డ్రోన్ల విక్రయం..

నవతెలంగాణ-ఢిల్లీ : భారత్‌కు 31 ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు బైడెన్‌ యంత్రాంగం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు నోటిఫై చేస్తూ అవసరమైన ధ్రువీకరణను అందజేసినట్లు డిఫెన్స్ సెక్యూరిటీ కో-ఆపరేషన్ ఏజెన్సీ (డీఎస్‌సీఏ) గురువారం పేర్కొంది. ఈ నిర్ణయంతో దాదాపు 4 బిలియన్ డాలర్లు విలువైన భారీ ఒప్పందం ఖరారులో కీలక ముందడుగు పడింది. అమెరికా నుంచి కొనుగోలు చేసే డ్రోన్ల వల్ల భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. జల మార్గాల్లో గస్తీ, నిఘా మెరుగుపడుతుంది. పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి గతేడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఎంక్యూ-9బీ డ్రోన్ల ఒప్పందం గురించి ప్రకటన చేశారు. ‘‘మానవరహిత విమానాలను భారత్‌కు విక్రయించడం వల్ల అమెరికా విదేశాంగ విధానానికి ఊతం లభిస్తుంది. ఇరు దేశాల వ్యూహాత్మక మైత్రిని బలోపేతం చేయాలన్న జాతీయ భద్రతా లక్ష్యాలను నెరవేరుస్తుంది. మన ప్రధాన రక్షణ భాగస్వామి, ఇండో-పసిఫిక్‌, దక్షిణాసియా ప్రాంతంలో రాజకీయ సుస్థిరత, శాంతి, ఆర్థిక పురోగతికి చాలా కీలకమైన భారత భద్రతను మెరుగుపరుస్తుంది’ అని అమెరికా డీఎస్‌సీఏ వెల్లడించింది.
‘ప్రతిపాదిత విక్రయం సముద్ర మార్గాలలో మానవ రహిత నిఘా, నిఘా పెట్రోలింగ్‌ చేపట్టడం ద్వారా ప్రస్తుత, భవిష్యత్తు బెదిరింపులను ఎదుర్కోగల భారత్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. భారత్ తన మిలిటరీని ఆధునీకరించడంలో నిబద్ధతను ప్రదర్శించింది.. ఈ లోహవిహంగాలు, సేవలను తన సాయుధ దళాలలోకి చేర్చుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు’ అని పేర్కొంది. ప్రతిపాదిత ఒప్పందం కింద నౌకాదళం కోసం 15 సీ గార్డియన్‌ డ్రోన్లు, వైమానిక దళం, సైన్యం కోసం ఎనిమిదేసి చొప్పున స్కై గార్డియన్‌ డ్రోన్లను భారత్ సమకూర్చుకోనుంది. అయితే, కీలకమైన ఈ రక్షణ ఒప్పందంపై దాదాపు ఆరేళ్లపాటు చర్చలు జరిగాయి. చివరకు ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఖరారయ్యింది. అమెరికాతో దాదాపు 4 బిలియర్ డాలర్ల ఒప్పందం చేసుకుంది.  కానీ అధికారిక నోటిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందనే దానిపై నాకు ఎటువంటి సమాచారం లేదు’అని అన్నారు.

Spread the love