ది ఓవల్‌, లార్డ్స్‌!
– ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదికలు
దుబాయ్‌ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ వేదికలుగా ది ఓవల్‌, లార్డ్స్‌ మైదానాలు ఖరారు అయ్యాయి. 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జూన్‌లో ది ఓవల్‌లో జరుగనుంది. 2025 డబ్లూటీసీ ఫైనల్స్‌కు లార్డ్స్‌ స్టేడియం వేదిక కానుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. చారిత్రక తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్‌కు సైతం లార్డ్స్‌ మైదానం ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ది ఓవల్‌, లార్డ్స్‌ మైదానాలు లండన్‌ నగరంలోనే ఉండటం విశేషం.

Spread the love