Penny Shares: చిన్న షేర్లు దుమ్ము రేపుతున్నాయి..మార్కెట్లు పడినా పరుగు ఆపట్లే!

 

Penny Shares: ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల సంకేతాలు మార్కెట్లను కిందకి పడేస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో అన్ని మార్కెట్లు కూడా నష్టాలలో కొనసాగుతున్నాయి. అయితే మార్కెట్లు పడినా.. చిన్న షేర్లు మాత్రం దుమ్మురేపుతున్నాయి. ఈ చిన్న షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకి లాభాలు పండిస్తున్నాయి. ఈ లాభాలు తదుపరి సెషన్స్‌లో కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ స్టాక్స్‌పై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచితే మంచిదేమో.
Penny Shares: అత్యధికంగా పెరిగిన ద్రవ్యోల్బణ కట్టడి కోసం అమెరికా ఫెడరల్ రిజర్వు 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచడంతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు పాలవుతున్నాయి. డాలర్ రెండు దశాబ్దాల గరిష్టానికి ఎగిసింది. రూపాయి రికార్డు కనిష్టాలకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మందగమనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా అర శాతం మేర కిందకి పడిపోయాయి. బీఎస్ఈ ఫైనాన్సియల్ సర్వీసెస్, బీఎస్ఈ బ్యాంకెక్స్ రంగాలు ఎక్కువగా నష్టపోతున్నాయి. మెజార్టీ రంగాలు బలహీనంగా ఉన్న సమయంలో.. బీఎస్ఈ ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ రంగం ఇన్వెస్టర్ల ఆసక్తిని చూరగొంటోంది. ఈ రంగం సుమారు ఒక శాతం మేర పెరిగింది.

Spread the love