లక్నవరం పర్యాటక కేంద్రాన్ని మరింత అభివృద్ధి పరుస్తాం

– మంత్రి దనసరి అనసూయ (సీతక్క)
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన లక్నవరం సరస్సును ముందు ముందు ఎంతో అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి సంస్థ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన లక్నవరం సరస్సును మంత్రి సీతక్క సందర్శించి వీక్షించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ లక్నవరం కొండల నడుమున అందమైన ప్రకృతి ఒడిలో పుట్టిన లక్నవరం సరస్సు అన్నారు. అనంతరం సీతక్క తన సహచరులతో కలిసి సరదాగా బోటింగ్ చేసి లక్నవరం అందాలను వీక్షించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామని ఇంకా లక్నవరం అందాలను ద్విగుణీకృతం చేసి, అత్యంత రమణీయ సరస్సు అందాలను పర్యాటకులకు ఇంకా అందంగా చూయించే విధంగా లక్నవరం సరస్సును తీర్చి దిద్దుతానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా, మండల, గ్రామ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
Spread the love