నవతెలంగాణ-గోవిందరావుపేట
వరద బాధితులకు హైదరాబాద్ మాకు ఉన్నాయా ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ప్రాజెక్టునగర్, పసర గ్రామంలో 300 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి రెడ్డి సాంబశివ మాట్లాడుతూ వరద బాధితులకు పరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నారు. వరద బాధితులకు న్యాయం జరగాలని ఆందోళన కార్యక్రమాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం నిర్వహిస్తున్నామని అన్నారు.మాకినేని బసవ పున్నయ్య ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నగర్ మరియు పసర గ్రామాల్లో వరద బాధితులైన 300 కుటుంబాలకు ముఖ్య అవసరాలను నేడు పంపిణీ చేయడం జరిగిందని అదేవిధంగా హెల్త్ క్యాంపు కూడా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆగిరెడ్డి, చిట్టీ బాబు, రాజేష్, సూర్యనారాయణ , మోహన్ రెడ్డి జ్యోతి, అరుణ్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.