రైతాంగానికి న్యాయమే జరుగుతుంది: ఏడిఏ శ్రీధర్

నవతెలంగాణ-గోవిందరావుపేట

అకాల వర్షాలు వరదలకు దెబ్బతిన్న భూముల రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఏడిఏ శ్రీధర్ అన్నారు. మంగళవారం మండలంలోని అమృతండాకర్లపల్లి లక్ష్మీపురం ముద్దుల గూడెం గ్రామాల్లో గుండ్ల వాగు పరి వాహక ప్రాంతంలో దెబ్బతిని కోతకు గురై ఇసుక మెటల్ వేసిన భూములను మండల వ్యవసాయ అధికారి కే జితేందర్ రెడ్డి తో కలిసి సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీఏ శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుతం నాట్లు వేసిన పొలాలు మరియు నాట్లు వేయబోయే పొలాలు కూడా వ్యవసాయానికి అక్కరకు రాకుండా పోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం తాము సర్వే ప్రారంభించినామని త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. రైతులకు న్యాయం జరిగేందుకు వ్యవసాయ శాఖ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని ప్రస్తుత వ్యవసాయంలో రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ వ్యవసాయ రంగంలో ముందుకు సాగాలని సూచించారు.
Spread the love